మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!

22-06-2021 Tue 15:54
  • అనారోగ్యంతో కన్నుమూశాడంటున్న పోలీసులు
  • ఈ సాయంత్రం అధికారిక ప్రకటన చేసే అవకాశం
  • కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్
  • ఏజెన్సీ ప్రాంతంలో కరోనా బారిన మావోయిస్టులు!
Maoist leader Haribhushan reportedly died in Chhattisgarh

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. హరిభూషణ్ అనారోగ్యంతో కన్నుమూసినట్టు పోలీసు వర్గాల కథనం. హరిభూషణ్ మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామం. ఆయన అసలు పేరు యాపా నారాయణ. కాగా, హరిభూషణ్ మృతిపై పోలీసులు ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ఏజెన్సీ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడి ఉంటారని ఇటీవల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజేశ్, ఇడుమా, వినోద్ వంటి మావోలు కరోనాతో బాధపడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోలు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల ప్రకటించారు.