'వలిమై'లో మనసును కదిలించే మదర్ సెంటిమెంట్!

22-06-2021 Tue 12:16
  • అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
  • హెచ్ వినోద్ తో రెండవ సినిమా
  • కథానాయికగా హుమా ఖురేషి  
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
Mother sentiment is highlight in Valimai movie

కొంతకాలంగా అజిత్ వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'వలిమై' రూపొందుతోంది. హెచ్. వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా స్టిల్స్ చూసినవారు ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా అనే అనుకుంటున్నారు. కానీ ఇందులో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. మనసులను కదిలించే ఎమోషన్ ఉంటుందని చెబుతున్నారు. యువన్ శంకర్ రాజా 'అమ్మ'పై స్వరపరిచిన ఒక పాట ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో అజిత్ సరసన కథానాయికగా హుమా ఖురేషి నటిస్తోంది. ఇక ప్రతినాయకుడిగా తెలుగు హీరో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో విలన్ గా కూడా కార్తికేయ బిజీ కానున్నాడని చెబుతున్నారు. అజిత్ - హెచ్. వినోద్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'నెర్కొండ పారవై' భారీ విజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.