జ‌గ‌న్ గారిది స్ఫూర్తిదాయ‌క నాయ‌క‌త్వం: చిరంజీవి ప్ర‌శంస‌లు

22-06-2021 Tue 12:14
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు
  • కొవిడ్ భూతాన్ని ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది
  • జ‌గ‌న్ గారికి అభినంద‌న‌లు  
Congrats to Sri ysjagan  for  inspiring leadership

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా నిన్న ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లో ఈ వైద్య సిబ్బంది ఈ ఘ‌న‌త సాధించారు. దీనిప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

'ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయ‌డం ఓ గొప్ప‌ కార్యం.. దీని ప‌ట్ల చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫ‌లితంగా కొవిడ్ భూతాన్ని ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది. ఈ ప్ర‌య‌త్నాల‌ను కొనసాగించాలి.  శ్రీ జ‌గ‌న్ గారిది స్ఫూర్తిదాయ‌క నాయ‌క‌త్వం.. ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు.