సికింద్రాబాద్-దానాపూర్ ప్రత్యేక రైళ్లను సెప్టెంబరు వరకు పొడిగించిన రైల్వే

22-06-2021 Tue 07:35
  • సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రతి రోజూ రైలు
  • వలస కార్మికుల నుంచి విపరీతమైన డిమాండ్
  • హతియా-ఎర్నాకుళం రైళ్ల సేవలు కూడా పొడిగింపు
Railway extended Secunderabad Danapur Rail services to september 30th

సికింద్రాబాద్ నుంచి దానాపూర్ (02787), దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌ (02788) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే నిన్న ప్రకటించింది. ప్రతి రోజూ అందుబాటులో ఉన్న సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌ రైలుకు వలస కార్మికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు వీటి సేవలను పొడిగించారు. మరోవైపు, హతియా-ఎర్నాకుళం మధ్య నడిచే రైళ్లను కూడా పొడిగిస్తున్నట్టు పేర్కొన్న రైల్వే.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపింది.