సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

22-06-2021 Tue 07:24
  • మరో వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన ఆదాశర్మ 
  • నాగార్జున సినిమాలో సీనియర్ హీరోయిన్ 
  • పూరి 'లైగర్'కి ఓటీటీ నుంచి భారీ ఆఫర్ 
Aada Sharma gives nod for another web Series

*  నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి దర్శకత్వంలో రూపొందుతున్న 'మీట్ క్యూట్' చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తున్న ఆదాశర్మ.. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథానాయిక ప్రధానంగా సాగే ఈ వెబ్ సీరీస్ ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారు.
*  గతంలో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ గా 'బంగార్రాజు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సీనియర్ నటి జయప్రదను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా రూపొందుతున్న 'లైగర్' చిత్రానికి ప్రముఖ ఓటీటీ ప్లేయర్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చింది. డైరెక్ట్ రిలీజ్ సహా అన్ని హక్కులకు కలిపి 200 కోట్లు ఆఫర్ చేసినట్టు, మేకర్స్ మాత్రం నో చెప్పినట్టు తెలుస్తోంది.