ప్రశాంత్ కిశోర్ తో శరద్ పవార్ ఆ విషయంపైనే మాట్లాడి ఉండొచ్చు: నవాబ్ మాలిక్

21-06-2021 Mon 20:03
  • దేశ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రశాంత్ కు బాగా తెలుసు
  • విపక్ష నేతలతో రేపు పవార్ సమావేశం నిర్వహిస్తున్నారు
  • విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పవార్ కృషి చేస్తున్నారు
Prashanth Kisore knows well abt our countries future politics says Nawab Malik

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ... దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ప్రశాంత్ కిశోర్ కు బాగా తెలుసని... దానిపైనే పవార్ తో ఆయన చర్చించి ఉండొచ్చని చెప్పారు. పవార్ అధ్యక్షతన విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశం రేపు జరగబోతోందని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి ఆర్జేడీ, టీఎంసీ, ఆస్, ఎన్సీపీ నేతలు హాజరవుతారని తెలిపారు. రాబోయే లోక్ సభ సమావేశాలతో పాటు, వివిధ అంశాలపై రేపటి సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. దేశంలోని అన్ని విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పవార్ కృషి చేస్తున్నారని తెలిపారు.