యాదాద్రికి చేరుకున్న కేసీఆర్

21-06-2021 Mon 18:33
  • వరంగల్ నుంచి యాదాద్రికి చేరుకున్న కేసీఆర్
  • యాదాద్రి పనులను పరిశీలించనున్న సీఎం
  • చివరి దశకు చేరుకున్న యాదాద్రి ఆలయం పనులు
KCR reaches Yadadri

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి నరసింహస్వామి ఆలయ పనులను ఆయన పరిశీలించనున్నారు. భారీ బడ్జెట్ తో యాదాద్రి అభివృద్ధి పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆలయాన్ని అత్యంత సుందరంగా పునర్నిర్మిస్తున్నారు. ఈ ఆలయ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. పనులను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. ఈరోజు వరంగల్ లో కేసీఆర్ పర్యటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు హన్మకొండగా నామకరణం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన యాదాద్రికి బయల్దేరారు.