డబ్ల్యూటీసీ ఫైనల్: నాలుగోరోజు ఆటలో ఒక్క బంతి పడకుండానే లంచ్!

21-06-2021 Mon 17:49
  • సౌతాంప్టన్ లో వర్షం
  • లంచ్ వరకు తుడిచిపెట్టుకుపోయిన ఆట
  • మైదానం జలమయం
  • తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది
Its lunch in day four of WTC Final

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో వరుణడి హవా కొనసాగుతోంది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సౌతాంప్టన్ లో తొలిరోజు నుంచి నేడు నాలుగో రోజు వరకు ప్రతి రోజూ వర్షం ఏదో ఒక దశలో అంతరాయం కలిగిస్తూనే ఉంది. తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఆటలో లంచ్ వరకు తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఒక్క బంతి పడకుండానే భారత్, న్యూజిలాండ్ జట్లు లంచ్ కు వెళ్లాయి. ఇప్పటికీ జల్లు కురుస్తూనే ఉండడంతో మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మైదానంలో ఓవైపు అధికంగా చేరిన నీటిని తొలగించేందుకు యంత్రాలను రంగంలోకి దించారు.