'ఐకాన్'పై హల్ చల్ చేస్తున్న రూమర్!

21-06-2021 Mon 17:32
  • 'పుష్ప' షూటింగులో బన్నీ
  • త్వరలో సెట్స్ పైకి 'ఐకాన్'
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  
Intresting romour on Icon movie

అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'పుష్ప' రూపొందుతోంది. ఓ 20 శాతం చిత్రీకరణ జరిపితే ఫస్ట్ పార్ట్ షూటింగు పూర్తవుతుంది. ఆ తరువాత ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇక ఈ టైటిల్ బన్నీ అభిమానులలో విపరీతమైన ఆసక్తిని పెంచింది. 'ఐకాన్' టైటిల్ కి 'కనబడుటలేదు' అనేది ట్యాగ్ లైన్ గా ఉంచారు. ఈ ట్యాగ్ లైన్ అందరిలో కుతూహలాన్ని రేకెత్తించింది .. ఫలానా అర్థమై ఉంటుందని ఎవరికి తోచినట్టుగా వారు ఊహించుకున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు ఈ ట్యాగ్ లైన్ పై ఒక వార్త షికారు చేస్తోంది. 'కనబడుటలేదు' అంటే హీరోకి కళ్లు కనిపించవని చెప్పుకుంటున్నారు. అంటే ఇందులో హీరో అంధుడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ పాళ్లు తగ్గుతాయని ఈ తరహా పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు అంతటి సాహసం చేయరు. ఒకవేళ చేసినా అది కొంత సేపు మాత్రమే కావొచ్చు. ట్యాగ్ లైన్ కథతో లింకై ఉంటుంది గనుక అసలు విషయాన్ని మేకర్స్ స్పష్టం చేయకపోవచ్చు కూడా.