230 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

21-06-2021 Mon 17:28
  • నష్టాల నుంచి లాభాల్లోకి మరలిన మార్కెట్లు
  • 63 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతం వరకు లాభపడిన ఎన్టీపీసీ
Sensex closes 230 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ తదితర హెవీ వెయిట్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడి 52,574కి చేరుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 15,746 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.87%), టైటాన్ కంపెనీ (1.87%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.31%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.30%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-0.82%), టీసీఎస్ (-0.74%), టెక్ మహీంద్రా (-0.71%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.63%), ఎల్ అండ్ టీ (-0.59%).