ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకం పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా

21-06-2021 Mon 17:16
  • నీలం సాహ్నీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ శైలజ
  • నేడు విచారణ చేపట్టిన హైకోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా
High court adjourns hearing on petition against SEC Neelam Sahni appointment

ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పిటిషనర్ డాక్టర్ శైలజ తరఫున న్యాయవాది ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు.

సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోకుండానే నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలు చేపట్టారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కు నెల రోజుల సమయం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, ఎస్ఈసీగా వ్యవహరించిన నీలం సాహ్నీ అదేమీ పట్టించుకోకుండా ఎన్నికలు జరిపారని ఆరోపించారు. తద్వారా రూ.160 కోట్ల మేర ప్రజల డబ్బు వృథా అయిందని తెలిపారు. ఈ డబ్బు ఎవరు తిరిగి చెల్లిస్తారని న్యాయవాది ప్రసాద్ బాబు ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.