వచ్చేనెలలోనే సెట్స్ పైకి పవన్ - హరీశ్ ప్రాజెక్టు!

21-06-2021 Mon 17:05
  • షూటింగు దశలో 'హరి హర వీరమల్లు'
  • సెట్స్ పైనే ఉన్న సాగర్ చంద్ర ప్రాజెక్టు
  • మరోసారి హరీశ్ శంకర్ తో సినిమా
  • గతంలో హిట్ కొట్టిన 'గబ్బర్ సింగ్'
Harish Shankar movie update

కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో .. జాగ్రత్తలు పాటిస్తూనే షూటింగులు చేయడానికి అంతా రెడీ అవుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చేస్తున్న పవన్, ఆ తరువాత సినిమాను సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ సినిమాను చేయడానికి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నెలకి పది రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇక వచ్చేనెల 3వ వారం నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించనున్నాడని అంటున్నారు. గతంలో పవన్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో సహజంగానే కొత్త ప్రాజెక్టుపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది.