Sonu Sood: కొత్తకారుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్!

  • త‌న కొడుకు ఇషాన్‌కు రూ.3 కోట్ల కారు ఇచ్చార‌ని ప్ర‌చారం
  • ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా కొనిచ్చారంటూ వార్త‌లు
  • ఫాద‌ర్స్ డే రోజు తండ్రికి పిల్ల‌లు గిఫ్టులు ఇస్తారు
  • అంతేగానీ, పిల్ల‌ల‌కి తండ్రి ఇస్తాడా? అని వ్యాఖ్య‌
sonu sood gives calrity on car

సినీన‌టుడు సోనూసూద్ త‌న కొడుకు ఇషాన్‌కు రూ.3 కోట్ల విలువైన‌ కారుని ఫాద‌ర్స్ డే గిఫ్ట్ గా కొనిచ్చారంటూ ప్ర‌చారం జరుగుతోంది. అందులో కుటుంబ స‌భ్యుల‌తోనూ క‌లిసి తిరిగార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై సోనూసూద్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

వైర‌ల్ అవుతోన్న‌ ఫొటోల్లో కనిపిస్తోన్న కారుని ట్ర‌యల్స్ కోసం తీసుకొచ్చామ‌ని వివ‌రించారు. అయినా, ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా పిల్ల‌లు తండ్రికి గిఫ్ట్ ఇస్తారు కానీ, ఎక్క‌డైనా తండ్రి పిల్ల‌ల‌కి గిఫ్ట్ ఇస్తాడా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పిల్లలు, ఫ్యామిలీతో తాను సమయం గడిపితే చాలని, అదే వాళ్లకు ఇవ్వగలిగే పెద్ద బహుమతి అని చెప్పారు. వాళ్లతో సమయం గడపడానికి వీలు దొరకడం లేదని అన్నారు.

భార్య, పిల్ల‌ల‌తో కలిసి కేవలం టెస్ట్‌ రన్‌కు వెళ్లానని తెలిపారు. త‌న కుమారుడు ఇషాన్‌కి కారు కొనుగోలు చేసినట్లు వచ్చిన‌ వార్తల్లో నిజం లేదని తెలిపారు. న‌కిలీ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో కొంద‌రు త‌న‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని చెబుతూ, అటువంటి స‌మ‌యంలోనూ త‌నకు అండ‌గా నిల‌బ‌డుతున్న‌వారికి థ్యాంక్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News