Usain Bolt: పరుగుల వీరుడు బోల్ట్​ కు కవలలు.. పెట్టిన పేర్లపై సోషల్​ మీడియాలో చర్చ!

Usain Bolt Has Twin Boys Their Names Take Social Media By Storm
  • ఇద్దరూ మగ పిల్లలే
  • ఫాదర్స్ డే సందర్భంగా ప్రకటించిన బోల్ట్ దంపతులు
  • థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని నామకరణం
  • పెద్ద కూతురి పేరు ఒలంపియా లైట్నింగ్ బోల్ట్
పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలు కలిగినట్టు బోల్ట్, ఆయన అర్ధాంగి కాసి బెనెట్ నిన్న ప్రకటించారు. అంతేకాదు పిల్లల పేర్లనూ వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆ పేర్లపైనే సోషల్ మీడియా కామెంట్లు చేస్తోంది. 'పేర్లు భలే ఉన్నాయే' అంటూ సెటైర్లతో పాటు శుభాభినందనలు చెబుతున్నారు నెటిజన్లు.

తన ఇద్దరు కుమారులకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని బోల్ట్ దంపతులు నామకరణం చేశారు. తమ కూతురుకూ అదే స్టైల్ లో ఒలంపియా లైట్నింగ్ బోల్ట్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని బోల్ట్, ఆయన భార్య కాసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బోల్ట్ కు కాసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. తమ పిల్లలకు ఓ గొప్ప తండ్రి దొరికాడంటూ ఇన్ స్టాలో కామెంట్ చేసింది.

వారు పెట్టిన పేర్లపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘‘లైట్నింగ్, థండర్? తుపాను రావొచ్చేమో’’ అని పేర్కొంటూ ఓ నెటిజన్ కంగ్రాట్స్ చెప్పింది. లైట్నింగ్, థండర్ బాగానే ఉన్నాయి గానీ, ఆ మూడో వాడి పేరే ఉసేన్ బోల్ట్ మధ్య పేరు ‘సెయింట్ లియో’ అని పెట్టడమే బాలేదేమోనంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టింది. కాగా, 34 ఏళ్ల ఉసేన్ బోల్ట్ 2008, 2012, 2016 ఒలింపిక్స్ లో 8 బంగారు పతకాలను సాధించాడు. 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

మొత్తంగా తన కెరీర్ లో ప్రధాన చాంపియన్ షిప్ లలో 23 గోల్డ్ మెడల్స్ గెలిచాడు. రిటైర్మెంట్ తర్వాత ఫుట్ బాల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకున్న బోల్ట్ కు నిరాశే ఎదురైంది. అతడికి కాంట్రాక్ట్ దక్కలేదు. దీంతో 2019లో అన్ని క్రీడల నుంచి తప్పుకొంటున్నట్టు బోల్ట్ ప్రకటించాడు.
Usain Bolt
Sprint
Olympics

More Telugu News