Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ.. మీది అవకాశవాద రాజకీయం కదూ?: వ‌ర్ల రామ‌య్య‌

varla slams jagan
  • ఆనాడు శాసన మండలిలో మీకు మెజారిటీ తక్కువ
  • దీంతో మండ‌లిని ర‌ద్దు చేయాలని తీర్మానం
  • ఇప్పుడు మెజారిటీ ఉందని మండలిని స్వాగతిస్తున్నారు

గ‌తంలో శాసన మండలిని ర‌ద్దు చేయాల‌ని చెప్పిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

'ముఖ్యమంత్రి గారూ! మీది అవకాశవాద రాజకీయం కదూ? ఆనాడు, శాసన మండలిలో మీకు మెజారిటీ తక్కువుందని రద్దు చేయాలని తీర్మానం చేసారు. ఇప్పుడు మెజారిటీ ఉందని మండలిని స్వాగతిస్తున్నారు. దళితులు మీ బంధువులన్నారు, వారిమీద దాడులు చేస్తే, ఏమాత్రం స్పందించరు? అసలు బంధువులను మాత్రం అందలమెక్కిస్తారు' అని వ‌ర్ల రామ‌య్య చెప్పారు.

  • Loading...

More Telugu News