Google Maps: మిస్టరీ ఐలండ్‌ను గుర్తించిన కేరళ.. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పున్న దీవి!

  • ఇటీవల గూగుల్ మ్యాప్స్‌లో బయటపడిన దీవి
  • గుర్తించిన చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ
  • పరిశోధనకు ఆదేశించిన కేరళ ప్రభుత్వం
Google Map 8 km long and 3 km wide mysterious island in the kerala

గూగుల్ మ్యాప్స్‌లో బయటపడిన రహస్య దీవిని కేరళ గుర్తించింది. గూగుల్ మ్యాప్స్‌లో ఇటీవల బయటపడిన ఈ రహస్య దీవి అందరిలోనూ ఆసక్తిని, కుతూహలాన్ని కలిగించింది. తాజాగా కేరళకు చెందిన చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ గుర్తించింది. అరేబియా సముద్ర గర్భంలో కొచ్చి తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య దీవి ఉన్నట్టు సంస్థ అధక్ష్యుడు జేవీఆర్ జుల్లప్పన్ తెలిపారు.

నీటి అడుగున ప్రవాహం కారణంగా ఇది ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అవక్షేపం, కోతకు గురికావడం వంటి కారణాల వల్ల కూడా ఇలాంటి దీవులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ దీవి ఉన్నట్టు చెప్పారు. ఇక్కడ దీవిలాంటి నిర్మాణాన్ని గత నాలుగేళ్లుగా గమనిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ దీవి పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదన్నారు. కాగా, ఈ మిస్టరీ ఐలండ్‌పై పరిశోధన చేయాల్సిందిగా రాష్ట్ర ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News