రైలు ప్రమాదంలో కుమారుడు చనిపోయినట్టు నమ్మించి ప్రభుత్వ ఉద్యోగం.. 11 ఏళ్ల తర్వాత బయటపడిన బాగోతం!
- 2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 148 మంది మృతి
- తమ కుమారుడు కూడా చనిపోయినట్టు నమ్మించి పరిహారం, ఉద్యోగం పొందిన కుటుంబం
- విషయం తెలిసి రంగంలోకి దిగిన సీబీఐ
- నిందితుల అరెస్ట్
2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 148 మంది చనిపోయారు. వీరిలో తమ కుమారుడు అమృతాబ్ చౌధరి (27) కూడా ఉన్నట్టు కుటుంబ సభ్యులు నకిలీ ధ్రువీకరణ పత్రం, డీఎన్ఏ శాంపిళ్లను అధికారులకు అందించారు. దీంతో ఆ కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం అందించడంతో అమృతాబ్ సోదరికి ఉద్యోగం కూడా ఇచ్చారు.
ఇక్కడి వరకు వరకు బాగానే ఉన్నా రైలు ప్రమాదంలో మరణించినట్టు చెప్పిన అమృతాబ్ బతికే ఉన్నట్టు రైల్వే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు అమృతాబ్ చౌధరితోపాటు అతడి తండ్రి మిహిర్ చౌధరిని అరెస్ట్ చేశారు.