New Zealand: డబ్ల్యూటీసీ ఫైనల్: న్యూజిలాండ్ కు శుభారంభం అందించిన ఓపెనర్లు

New Zealand gets good opening partnership in WTC Final
  • డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, కివీస్ అమితుమీ
  • సౌతాంప్టన్ లో మ్యాచ్
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 217 రన్స్
  • 1 వికెట్ నష్టానికి 70 పరుగులు చేసిన కివీస్
భారత్ తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం లభించింది. సౌతాంప్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (30), డెవాన్ కాన్వే (38) తొలి వికెట్ కు 70 పరుగులు జోడించారు. ఈ జోడీని చివరికి అశ్విన్ విడదీశాడు. లాథమ్ ను అశ్విన్ అవుట్ చేయడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

కొత్తబంతితో బుమ్రా, ఇషాంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మహ్మద్ షమీ కివీస్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు న్యూజిలాండ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
New Zealand
India
WTC Final
Southampton

More Telugu News