తెలంగాణలో మరో 1,006 మందికి కరోనా పాజిటివ్

20-06-2021 Sun 20:43
  • తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 87,854 కొవిడ్ టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 141 కొత్త కేసులు
  • నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాని వైనం
Huge dip in Telangana corona cases

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా అదుపులోకి వచ్చింది. గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ (141) మినహా, తెలంగాణ జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రంలో 1,798 మందికి కరోనా నయం కాగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 3,567 మరణాలు నమోదయ్యాయి.

తెలంగాణలో ఇప్పటిదాకా 6,13,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,91,870 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,765 మందికి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది.