ఒలింపిక్స్ కు వెళ్లే భారత అథ్లెట్లకు బీసీసీఐ రూ.10 కోట్ల ఆర్థికసాయం
- జులై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
- భారత్ నుంచి తరలివెళ్లనున్న భారీ బృందం
- అథ్లెట్ల సాధన, సన్నాహకాల కోసం బీసీసీఐ సాయం
- అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత అథ్లెట్లు మరింత మెరుగైన రీతిలో సన్నద్ధమయ్యేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ నిధిని ఎలా ఉపయోగించుకుంటారన్న దానిపై కేంద్ర క్రీడల శాఖ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) విధివిధానాలు ఖరారు చేస్తాయని వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇంతకుముందు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్ క్రీడలు జులై 23 నుంచి జరగనున్నాయి.