Team India: డబ్ల్యూటీసీ ఫైనల్: తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌటైన టీమిండియా

  • సౌతాంప్టన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
  • తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 5 వికెట్లతో రెచ్చిపోయిన జేమీసన్
  • 49 పరుగులతో టాప్ స్కోరర్ గా రహానే
Team India all out for a low total in first innings of WTC Final

సౌతాంప్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌటైంది. స్వింగ్ కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో కివీస్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ముఖ్యంగా, పొడగరి పేస్ బౌలర్ కైల్ జేమీసన్ టీమిండియా వెన్నువిరిచాడు. 22 ఓవర్లు బౌలింగ్ చేసిన జేమీసన్ 31 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. ఈ క్రమంలో జేమీసన్ ఏకంగా 12 ఓవర్లు మెయిడెన్ చేశాడు. ఇక, సీనియర్ బౌలర్లు బౌల్ట్, వాగ్నర్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటగా, టిమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు.

భారత ఇన్నింగ్స్ లో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సాధించిన 49 పరుగులే అత్యధికం. చివర్లో అశ్విన్ (22) వేగంగా ఆడడంతో భారత్ స్కోరు 200 దాటింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News