Andhra Pradesh: లాక్‌డౌన్ ఎత్తి వేయ‌డంతో తెలంగాణ‌-ఆంధ్ర స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ వాహ‌నాల రాక‌పోక‌లు షురూ

  • ఎలాంటి ఆటంకాలూ లేకుండా వాహ‌నాల రాక‌పోక‌లు
  • అంతర్రాష్ట్ర బస్సుల విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు
  • ఏపీలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద  మాత్రం ఆంక్ష‌లు  
no restrictions at border

లాక్‌డౌన్ నేప‌థ్యంలో తెలంగాణ‌-ఆంధ్ర స‌రిహ‌ద్దుల్లో ఇటీవ‌ల వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురైన విష‌యం తెలిసిందే. ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ  తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఈ రోజు ఉద‌యం నుంచి సరిహద్దుల్లో వాహనాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా నడువనున్నాయి.  

అయితే,  బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తాయని తెలంగాణ ప్ర‌భుత్వం ప్రకటించినప్పటికీ  అంతర్రాష్ట్ర బస్సుల విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీంతో వాటి రాక‌పోక‌ల‌పై ప్ర‌జ‌ల్లో సందేహాలు ఉన్నాయి.లాక్‌డౌన్ విధించ‌డంతో హైద‌రాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్ల‌కు వెళ్లిన జ‌నాలు తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏపీలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద  పోలీసులు ఆంక్ష‌లు కొనసాగేలా చూస్తున్నారు. ప్ర‌తి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమ‌ల్లో ఉన్న సమయంలో ఈ -పాస్ ఉంటేనే ఆంధ్రాలోకి పోలీసులు అనుమతి ఇస్తారు.

More Telugu News