Maoist: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సహా పలువురిపై కేసులు

  • ‘తీగలమెట్ట’ ఎదురు కాల్పులకు సంబంధించి కేసులు
  • ఉపా, ఏపీపీఎస్ చట్టాలు కూడా ప్రయోగం
  • ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారని అభియోగాలు
Police files Cases against Maoist top leaders

మావోయిస్టు అగ్రనేతలు రామకృష్ణ సహా పలువురిపై విశాఖపట్టణం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తీగలమెట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండడం వంటి అభియోగాలతో 20 సెక్షన్లతో కూడిన కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఉపా, ఏపీపీఎస్ వంటి చట్టాలను కూడా వీరిపై ప్రయోగించినట్టు సమాచారం.

కేసులు నమోదైన మావోయిస్టు నేతల్లో గణేశ్, అరుణ, జగన్, సుధీర్, ఉదయ్‌తోపాటు ఇతర మిలీషియా సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తికావడంతో శుక్రవారం రాత్రి అశోక్, రణదేవ్, లలిత మృతదేహాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. మిగతా ముగ్గురి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదని పోలీసులు తెలిపారు.

More Telugu News