Etela Rajender: రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయం: ఈట‌ల‌

  • సొంత‌ పార్టీ నేత‌ల‌ను కొనుగోలు చేసే స్థితికి టీఆర్ఎస్ చేరుకుంది
  • సీఎం కేసీఆర్ కేవ‌లం డబ్బు, అధికారాన్ని నమ్ముకున్నారు
  • ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జ‌రిగితే టీఆర్ఎస్ కు డిపాజిట్ ద‌క్క‌దు
  • హుజూరాబాద్‌లో మేమే గెలుస్తాం
etela slams trs

తెలంగాణ స‌ర్కారుపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. హుజూరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కేవ‌లం డబ్బు, అధికారాన్ని నమ్ముకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని విమర్శించారు.

హుజూరాబాద్‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ ప్రజాస్వామ్యబద్ధంగా కొన‌సాగితే టీఆర్ఎస్ అభ్య‌ర్థికి డిపాజిట్‌ కూడా ద‌క్క‌ద‌ని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధిష్ఠానం చివ‌ర‌కు వారి సొంత‌ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే స్థితికి చేరుకుంద‌ని అన్నారు. కేసీఆర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిన‌ప్ప‌టికీ రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని చెప్పారు.

రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను యాచకులుగా మార్చే పాలన కొన‌సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీయే గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవమూ ప్ర‌ధాన‌మేన‌ని చెప్పారు.

More Telugu News