డబ్ల్యూటీసీ ఫైనల్స్: త‌క్కువ ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన టీమిండియా టాప్ ఆర్డ‌ర్

19-06-2021 Sat 19:31
  • భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్
  • రోహిత్ శ‌ర్మ 34, శుభ్‌మన్ గిల్ 28 ప‌రుగులు
  • చ‌టేశ్వ‌ర్ పూజారా 8 ప‌రుగులు చేసి ఔట్‌
  • క్రీజులో రోహిత్ శ‌ర్మ (27), అజింక్యా ర‌హానె (8)
  • టీమిండియా స్కోరు 52 ఓవ‌ర్ల వ‌ద్ద‌ 108/3
wtc match updates

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో మొద‌ట‌ బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా కీల‌క వికెట్లు కోల్పోయింది. టీమిండియా స్కోరు 62 ప‌రుగుల వ‌ద్ద రోహిత్ శ‌ర్మ‌, ఆ వెంట‌నే 63 ప‌రుగుల వ‌ద్ద శుభ్‌మన్ గిల్ ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం.

కొద్దిసేప‌టి త‌ర్వాత టీమిండియా స్కోరు 88గా ఉన్న స‌మ‌యంలో చ‌టేశ్వ‌ర్ పుజారా కూడా ఔట‌య్యాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల ధాటికి టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ 34, శుభ్‌మన్ గిల్ 28, చ‌టేశ్వ‌ర్ పూజారా 8 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ 27, అజింక్యా ర‌హానె 8 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 52 ఓవ‌ర్ల వ‌ద్ద‌ 108/3గా ఉంది.