థియేటర్లలో దిగడానికి రెడీ అవుతున్న 'పాగల్'

19-06-2021 Sat 18:07
  • విష్వక్సేన్ నుంచి 'పాగల్'
  • కరోనా కారణంగా రిలీజ్ ఆలస్యం
  • త్వరలోనే థియేటర్లకు
  • సంగీత దర్శకుడిగా రధన్
Paagal will be released soon

తెలుగులో యువ కథానాయకులకు గట్టిపోటీ ఇవ్వడానికి విష్వక్సేన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. 'హిట్' సినిమాతో హిట్ కొట్టేసిన ఆయన 'పాగల్' ను రెడీ చేశాడు. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల జాబితాలో 'పాగల్' కూడా ఉంది. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విష్వక్ సేన్ సరసన సిమ్రన్ చౌదరి .. నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వస్తే నిర్మాతలు ఖండించారు. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు.

అయితే ఇప్పుడు వచ్చే నెల నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అలా థియేటర్లు ఓపెన్ అయితే, ముందుగా ప్రేక్షకులను పలకరించే సినిమాల జాబితాలో 'పాగల్' ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. థియేటర్లు తెరుచుకున్న కొన్ని రోజులకు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో విష్వక్ సేన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.