దసరా బరిలో దిగనున్న 'పుష్ప' రాజ్!

19-06-2021 Sat 17:34
  • ముగింపు దశలో 'పుష్ప'
  • వచ్చేనెలలో షూటింగు పూర్తి
  • బన్నీ తరువాత ప్రాజెక్టు 'ఐకాన్'
  • దర్శకుడిగా వేణు శ్రీరామ్
Pushpa will be released on Dasara

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రూపొందుతోంది. కరోనా తీవ్రత పెరిగే సమయానికి ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇక షూటింగును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా షూటింగును కొనసాగించేందుకు సుకుమార్ చకచకా సన్నాహాలు చేస్తున్నాడట. వచ్చేనెల మొదటివారంలో షూటింగును మొదలుపెట్టి .. నెలాఖరుకి షూటింగు పార్టును కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటారట.

'పుష్ప' సినిమాకి సంబంధించిన నిర్మాణానంతర పనులను ఆగస్టు .. సెప్టెంబర్ మాసాల్లో పూర్తిచేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 'పుష్ప' సినిమా తరువాత అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత 'పుష్ప 2' ప్రాజెక్టుపైకి వెళతాడు. 'పుష్ప' రెండు భాగాలుగా రానుండటం .. మొదటి భాగం దసరాకే రానుండటం బన్నీ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి.