Balakrishna: బోయపాటిని రంగంలోకి దిగమన్న బాలయ్య!

Akhanda shooting will be re starts from next month
  • బోయపాటితో బాలయ్య 'అఖండ'
  • చిత్రీకరణ పరంగా ముగింపు దశలో
  • వచ్చేనెలలో మళ్లీ సెట్స్ పైకి
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్  
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. మరో 15 .. 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపితే, షూటింగు పార్టు పూర్తవుతుంది. అయితే ఈ లోగానే కరోనా తీవ్రత పెరగడంతో షూటింగును ఆపేశారు. అయితే కొన్ని రోజులుగా కరోనా ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు తిరిగి సెట్స్ పైకి చేరుకుంటున్నాయి. బాలకృష్ణ కూడా తమ సినిమా షూటింగు పనులు తిరిగి మొదలుపెట్టమని బోయపాటితో చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ తన సినిమాల విషయంలో ఎంతమాత్రం ఆలస్యం కానివ్వరు. అసలు ఈ సినిమాను ఎన్టీఆట్ జయంతికే విడుదల చేయాలని ఆయన అనుకున్నారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కుదరలేదు. ఇప్పటికే ఆలస్యం అయిన కారణంగా ఇక సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తిచేయాలని ఆయన బోయపాటితో అన్నారట. ప్రస్తుతం బోయపాటి అందుకు సంబంధించిన పనుల్లోనే ఉన్నాడనీ, జులై మొదటివారంలో సెట్స్ పైకి వెళతారని చెప్పుకుంటున్నారు. బాలయ్య స్పీడ్ చూస్తుంటే, ఈ సినిమాను దసరా బరిలో దింపేలానే ఉన్నారు మరి!
Balakrishna
Pragya Jaiswal
Poorna

More Telugu News