'ఖిలాడి'కి హైలైట్ గా ఇటలీ యాక్షన్ ఎపిసోడ్!

19-06-2021 Sat 13:23
  • రవితేజ ద్విపాత్రాభినయంతో 'ఖిలాడి'
  • భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పై ప్రత్యేక దృష్టి
  • కథానాయికలుగా మీనాక్షి - డింపుల్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Raviteja action is highlight in Khiladi

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఖిలాడి. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి ముందు ఇటలీ వెళ్లిన ఈ సినిమా టీమ్, రవితేజ తదితరులపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించుకుని వచ్చారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను అన్బు - అరివు డిజైన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఇక అన్బు - అరివుతో పాటు, రామ్ - లక్ష్మణ్ కూడా ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫర్లుగా పనిచేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ముఖేశ్ రిషి .. రావు రమేశ్ .. మురళీశర్మ కనిపించనున్నారు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో అనసూయ అలరించనుంది.