పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తికేయ .. రేపే ఫస్టులుక్!

19-06-2021 Sat 12:49
  • కార్తికేయకు వరుస పరాజయాలు
  • నిరాశపరిచిన 'చావుకబురు చల్లగా'
  • దర్శకుడిగా శ్రీ సరిపల్లికి ఛాన్స్
  • త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగ్
Karthikeya new movie first look will be relesed tomorrow

కార్తికేయ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'చావుకబురు చల్లగా' సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే గట్టినమ్మకంతో ఆయన ఉన్నాడు. అయితే ఆ సినిమా కూడా ఆయనను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, ఒక విభిన్నమైన కథను ఆయన ఎంచుకున్నాడు. ఈ కథతో శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా తాన్య రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ  సినిమా షూటింగు కొన్ని రోజుల పాటు నడిచిన తరువాత, కరోనా కారణంగా బ్రేక్ ఇచ్చారు.

అలాంటి ఈ సినిమా మళ్లీ ఇప్పుడు షూటింగుకు రెడీ అవుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కార్తికేయ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. రేపు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.