మళ్లీ సెట్స్ పైకి 'సర్కారువారి పాట'

19-06-2021 Sat 12:24
  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • వచ్చేనెలలో మళ్లీ సెట్స్ పైకి
  • సంక్రాంతికి భారీ స్థాయి రిలీజ్
  • తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
Sarkaruvaari Paata movie update

మహేశ్ బాబు కథానాయకుడిగా ' సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని, రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటూ ఉండగా, కరోనా తీవ్రరూపం ధరించింది. దాంతో షూటింగును ఆపేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లలేదు.

ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, జులై మొదటివారంలో మళ్లీ షూటింగునుకి మొదలుపెట్టే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల చివరి వరకూ నాన్ స్టాప్ గా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ బాబుతో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నారని చెబుతున్నారు.

ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా అలరించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.