ఘట్‌కేసర్‌లో రోడ్డు పక్కన క‌ల‌క‌లం... కాలిన స్థితిలో బాలిక మృత‌దేహం ల‌భ్యం

19-06-2021 Sat 12:17
  • ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఘ‌ట‌న‌
  • మృతురాలి పేరు స్రవంతిగా గుర్తింపు
  • అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
  • నిన్న అర్థరాత్రి తల్లితో గొడవపడి  ఇంట్లోంచి బయటకు వెళ్లిన బాలిక
girl dead body nea orr

ఘ‌ట్‌కేస‌ర్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓఆర్‌ఆర్‌ సమీపంలోని సర్వీస్‌ రోడ్డు పక్కన ఓ బాలిక మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారాన్ని అందించడంతో, అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు పక్కన ఆ బాలిక మృతదేహం కాలిన స్థితిలో పోలీసుల‌కు లభ్యమైంది. క్లూస్‌ టీంతో క‌లిసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

 మృతురారి పేరు స్రవంతిగా గుర్తించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నిన్న అర్థరాత్రి తల్లితో స్ర‌వంతి గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు బాలిక తండ్రి చెబుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.