వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు

19-06-2021 Sat 12:05
  • 30 మందికి గాయాలు
  • రోడ్డుపక్కన లారీ బోల్తా
  • శాయంపేటలో ప్రమాదం
Sand Laden Lorry Collides With RTC Bus

అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఇసుక లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. లారీ రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో ఇవ్వాళ ఉదయం జరిగింది.  ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పది మందికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.