హీరో విజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 64 లుక్స్ విడుద‌ల‌!

19-06-2021 Sat 12:04
  • ఈ నెల 22న పుట్టిన‌రోజు
  • లుక్స్ విడుద‌ల చేసిన‌ మాస్టర్ సినిమా నిర్మాత
  • అల‌రిస్తోన్న లుక్స్
vijay birthday special looks

స్టార్ హీరోల జ‌న్మ‌దిన వేడుక ఉందంటే అభిమానులు చేసే హంగామా అంతాఇంతా కాదు. హీరోల‌ పుట్టిన‌రోజు వేడుక‌ను పండుగగా చేసుకుంటారు. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హీరోల కామ‌న్ డీపీలు విడుద‌లవుతుంటాయి. త‌మిళ హీరో విజయ్  ఈ నెల 22న పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు సంబంధించిన ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.  

మాస్టర్ సినిమా నిర్మాత లలిత్‌కుమార్ కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుద‌ల చేసిన ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్ న‌టించిన 64 చిత్రాల‌కు సంబంధించిన లుక్‌లు ఉన్నాయి. ఇవి బాగా ఆక‌ట్టుకుంటుండ‌డంతో ఫ్యాన్స్ ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ త‌న కెరీర్‌లో 65వ సినిమాలో న‌టిస్తున్నాడు. దాని ఫ‌స్ట్ లుక్‌ను ఈ నెల‌ 21న సాయంత్రం 6 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు.