పరిషత్​ ఎన్నికలపై హైకోర్ట్​ డివిజన్​ బెంచ్​ లో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్​

19-06-2021 Sat 11:52
  • ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి
  • ఇప్పటికే పోలింగ్ ముగిసిందని కామెంట్
  • గత నెలలో ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు
AP SEC Appeals in Division Bench Over Single Judge Bench on Parishad Elections

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఇప్పటికే పోలింగ్ ముగిసిందని పేర్కొన్న ఎస్ఈసీ ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాల్సిందిగా ధర్మాసనాన్ని కోరింది.

ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సర్కారు పాటించలేదంటూ గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆ ఎన్నికలు చెల్లవంటూ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అంతేకాదు.. ఎన్నికల కమిషనర్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.