సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం: హైద‌రాబాద్‌లో ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బదౌరియా

19-06-2021 Sat 11:50
  • అవ‌స‌ర‌మైతే త్యాగం చేయడమే ఫ్లయింగ్‌ అధికారుల ధ్యేయం
  • దేశ భద్రతలో వాయుసేన కీలకం
  • కరోనా రెండో ద‌శ వేళ‌ ఆక్సిజన్‌ సరఫరాలోనూ కీలకపాత్ర
airforce is on the alert says air chief

దేశం కోసం అవ‌స‌ర‌మైతే త్యాగం చేయడమే ఫ్లయింగ్‌ అధికారుల ధ్యేయమని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బదౌరియా అన్నారు. హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్‌ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ఆయ‌న‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామన్నారు.

కరోనా రెండో ద‌శ వేళ‌ ఆక్సిజన్‌ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. కాగా, ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో 20,500 గంట‌ల‌ ఫ్ల‌యింగ్ శిక్ష‌ణ‌ను ఈ బ్యాచ్ పూర్తి చేసింద‌న్నారు.

వైమానిక ద‌ళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నార‌ని వివ‌రించారు. బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండ‌టం మంచి ప‌రిణామమ‌ని తెలిపారు. ఫ్లయింగ్‌ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.