TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి భేటీ

  • ఛైర్మన్‌ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 21తో పూర్తి  
  • ప్రస్తుత ధర్మకర్తల మండలికి ఇదే చివరి భేటీ
  • భక్తుల సౌకర్యాలు, ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌పై చ‌ర్చ‌
  • మొత్తం 108 అంశాలపై నిర్ణ‌యాలు
ttd board meets

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి పదవీకాలం ఈనెల 21తో ముగియనున్న నేపథ్యంలో బోర్డు సమావేశం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్రస్తుత ధర్మకర్తల మండలికి ఇదే చివరి భేటీ కానుంది. ఈ స‌మావేశంలో తిరుమలలో వివిధ ఇంజినీరింగ్‌ పనుల పురోగతి, భక్తుల సౌకర్యాలు, ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్, సంక్షేమ పథకాలు వంటి మొత్తం 108 అంశాలపై చర్చించనున్నారు.

తిరుపతిలో వాహన రద్దీని నియంత్రించేందుకు గరుడ వారధి నిర్మాణాలను అలిపిరి కూడలి వరకూ విస్తరించడంతో పాటు వరాహస్వామి ఆలయ వెండి వాకిలి నిర్మాణానికి 180 కిలోల వెండి కేటాయింపుపైనా ఇందులో నిర్ణ‌యాలు తీసుకుంటారు. తిరుమలలో కొత్తగా  సీసీ కెమేరాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చ‌ర్చిస్తారు.

More Telugu News