తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి విమర్శలు

19-06-2021 Sat 10:46
  • చివరకు తమ‌ చితి తామే పేర్చుకుంటున్నారు
  • ఆపై దానిపై కాల్చుకునే స్థితికి రైతులు చేరుకున్నారు
  • మీరు చెప్పే బంగారు తెలంగాణలో మీ పాలనలో రైతుల దీనస్థితి ఇది  
vishnu vardhan slams kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇల్లు ఇస్తామ‌న్న అధికారులు ఇవ్వ‌క‌పోవ‌డంతో నిర్వాసితుడు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడని  ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి పోస్ట్ చేశాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ కు చెందిన మల్లారెడ్డి.. కూల్చివేసిన తన ఇంట్లోనే చితిపేర్చుకుని దానిపైనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఇచ్చిన వార్త‌లోని విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

'అయ్యా కేసీఆర్ గారు… చివరకు తన చితి తాను పేర్చుకుని, కాల్చుకునే స్థితికి రైతులు చేరుకున్నారు.. మీరు చెప్పే బంగారు తెలంగాణలో  మీ పాలనలో  నేడు రైతుల దీనస్థితి ఇది' అంటూ  విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ ఖాతాల‌ను ఆయ‌న‌ ట్యాగ్ చేశారు.