వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని నలుగురి దుర్మరణం

19-06-2021 Sat 09:53
  • కొడంగల్ శివారులో ఘటన
  • కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు
  • మృతులను గుర్తించే పనిలో పోలీసులు
4 dead in an accident in vikarabad dist

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం కొడంగల్ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.