సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

19-06-2021 Sat 07:23
  • శంకర్ సినిమాకు కియారా ఖరారు
  • 'రాధే శ్యామ్'కు ఓటీటీ భారీ ఆఫర్
  • జులై మొదటి వారం నుంచి 'పుష్ప'
Kiara Advani opposite Ram Charan in Shankar movie

*  రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందే భారీ చిత్రంలో కథానాయిక పాత్రకు పలు పేర్లు వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఎంపిక ఖరారైంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని అంటున్నారు.
*  ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రానికి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందట. ZEE5 సంస్థ కళ్లు తిరిగే రేంజిలో ఆఫర్ చేసినప్పటికీ, నిర్మాతలు చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో తిరస్కరించినట్టు తెలుస్తోంది.
*  ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఇక సినిమా షూటింగులు ప్రారంభించడానికి ఆయా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగును జులై మొదటి వారం నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకధాటిగా జరిగే షూటింగుతో చిత్ర నిర్మాణం పూర్తిచేస్తారట.