Jagan: తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం వద్ద హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

Police high alert CM Jagan residence in Tadepalli
  • అమరావతి రైతుల దీక్షలకు రేపటితో 550 రోజులు
  • సీఎం కార్యాలయం ముట్టడిస్తారన్న సమాచారం
  • అప్రమత్తమైన పోలీసులు
  • భారీగా బందోబస్తు ఏర్పాటు
అమరావతి రైతుల దీక్షలకు రేపటితో 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో, నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

 సీఎం నివాసం పరిధిలో ఎవరైనా కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దారితీసే మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అమరావతి రైతులు ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ రైతుల దీక్షలు కొనసాగాయి.
Jagan
Residence
Tadepalli
Farmers
Amaravati
Andhra Pradesh

More Telugu News