ఈ ప్రభుత్వ హయాంలో నేరస్థులు నిర్భయంగా తిరుగుతున్నారు: వర్ల రామయ్య

18-06-2021 Fri 18:17
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
  • నేరస్థులను ఉపేక్షిస్తున్నారని ఆరోపణ
  • ముద్దాయిలు యథేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడి
  • రేపు శ్రీలక్ష్మి చీఫ్ సెక్రటరీ అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యలు
Varla Ramaiah comments on latest developments

టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నేరస్థులు నిర్భయంగా తిరుగుతున్నారని అన్నారు. నేరస్థులను ప్రశ్నించాల్సిన వారు మనకెందుకులే అని ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిపైనే ఇన్ని కేసులు ఉంటే మనకెందుకు భయం అని ముద్దాయిలు భావిస్తున్నట్టుంది అని వర్ల అభిప్రాయపడ్డారు. సహనిందితురాలు శ్రీలక్ష్మి రేపు చీఫ్ సెక్రటరీ అయినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. కొంతకాలం కిందట తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవ్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వచ్చిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం తొలుత పురపాలక శాఖ కార్యదర్శిగా నియమించింది. ఆపై ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది.