బాలకృష్ణ సినిమాకి నో చెప్పిన టబు?

18-06-2021 Fri 17:47
  • గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
  • సీనియర్ హీరోయిన్ కోసం వెతుకులాట
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
Tabu rejects acting in Balakrishna movie

టాలీవుడ్ లో కొంతకాలంగా సీనియర్ హీరోల సరసన చేయడానికి సీనియర్ హీరోయిన్లు దొరకడం లేదు. నయనతార తమిళ సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. అనుష్క చాలావరకూ సినిమాల సంఖ్యని తగ్గించేసింది. ఇక త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలను వరుసగా ఒప్పుకుని ఉంది. చిరంజీవి .. నాగార్జున సినిమాలతో కాజల్ బిజీగా అంది. ఇక మిగతా వాళ్లలో చాలామంది కేరక్టర్ ఆర్టిస్టులుగా చేసుకుంటూ వెళుతున్నారు. దాంతో సీనియర్ హీరోయిన్ల కోసం దర్శకులు భూతద్దం పట్టుకుని మరీ వెదుకుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని 'టబు'ను సంప్రదించాడట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను చేయలేనని చెప్పి ఆమె సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. దాంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైందని అంటున్నారు. గతంలో బాలకృష్ణ జోడీగా టబు 'చెన్నవకేశవ రెడ్డి' సినిమాలో చేసింది. అప్పుడు ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సారి ఈ కాంబినేషన్ సెట్ కావడం లేదు. ఇక ఒక హీరోయిన్ గా శ్రుతిహాసన్ .. ఓ కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తూనే ఉంది.