బాలీవుడ్ దర్శకుడితో సహజీవనం చేస్తున్న జాక్వెలిన్!

18-06-2021 Fri 17:39
  • సాజిద్ ఖాన్ తో సహజీవనం చేస్తున్న జాక్వెలిన్
  • రూ. 37 కోట్లతో బంగ్లా కొనుగోలు
  • గతంలో డేటింగ్ చేసి విడిపోయిన జాక్వెలిన్, సాజిద్
Jaqueline in relationship with Bollywood director Sajid Khan

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహజీవనం చేస్తోందంటూ బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన ప్రియుడు, బాలీవుడ్ దర్శకుడు, వ్యాపారవేత్త సాజిద్ ఖాన్ తో ఆమె కలిసి ఉంటోందని చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్ కథనాల ప్రకారం సాజిత్ తో కలిసి జాక్వెలిన్ ముంబై జుహు ప్రాంతంలో రూ. 37 కోట్లతో సముద్రముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేసిందట. ఈ బంగ్లా ఇంటీరియర్ పనుల కోసం ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్ ను ఖరారు చేశారట. 2011లో చిత్రీకరణ జరుపుకున్న ''హౌస్ ఫుల్ 2' సినిమా సమయంలోనే వీరిద్దరూ డేటింగ్ చేశారనే వార్తలు వెల్లువెత్తాయి. అయితే 2013లో వీరిద్దరూ బ్రేకప్ అయ్యారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ పాత విభేదాలు పక్కన పెట్టి కలిసి ఉంటున్నారని సమాచారం. ప్రభాస్ 'సాహో' చిత్రంలో జాక్వెలిన్ ఒక పాటలో మెరిసిన సంగతి తెలిసిందే.