Sensex: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

  • 21 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 8 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • మార్కెట్లపై ప్రభావం చూపిన అంతర్జాతీయ ప్రతికూలతలు
Stock markets ends in flat mode

ఇంట్రాడేలో భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు సెన్సెక్స్ ఒకానొక సమయంలో దాదాపు 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పత్రికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే, ఆ తర్వాత సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 52,344కి చేరుకుంది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 15,683 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.64%), బజాజ్ ఆటో (2.61%), భారతి ఎయిర్ టెల్ (1.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.08%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.72%), ఎన్టీపీసీ (-3.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.56%), నెస్లే ఇండియా (-2.08%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.76%).

More Telugu News