Kerala: కేరళ తీరంలో రహస్య దీవి... అధ్యయనం చేపట్టాలన్న రాష్ట్ర సర్కారు

  • గూగుల్ మ్యాప్స్ లో కొత్త దీవి ప్రత్యక్షం
  • చిక్కుడు గింజ ఆకారంలో ద్వీపం
  • నీటిలో మునిగివున్న వైనం
  • తీరప్రాంతం కోతకు గురికావడంతో ఏర్పడి ఉంటుందన్న అంచనాలు
Secret island emerges near Kerala coast in Arabian sea

కేరళ రాష్ట్రానికి సమీపంలో అరేబియా సముద్రంలో ఇప్పుడో కొత్త ద్వీపం ప్రత్యక్షమైంది. ఇది తాజాగా గూగుల్ మ్యాప్స్ లో కనిపించింది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ దీవి ఓ చిక్కుడు గింజ ఆకారంలో ఉంది. ఇది సుమారు 8 కిమీ పొడవు, 3 కిమీ వెడల్పుతో ఉన్నట్టు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా అంచనా వేశారు. కొచ్చి తీరానికి ఇది కేవలం 7 కిమీ దూరంలోనే ఉన్నప్పటికీ బయటికి కనిపించకపోవడంతో దీనిపై స్థానికులకు కూడా అవగాహన లేదు. ఇది సముద్రంలో మునిగినట్టుగా ఉంది.

ఇటీవల ఈ దీవి ఫొటోలను ఓ పర్యాటక సంస్థ అధ్యక్షుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అందరి దృష్టి ఈ రహస్య దీవి పైకి మళ్లింది. ఈ అంశంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. రహస్య దీవిపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ అధికారులను ఆదేశించింది. కాగా, తీర ప్రాంతం సుదీర్ఘకాలం పాటు కోతకు గురైన సందర్భాల్లో ఇలాంటి దీవులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

More Telugu News