కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు

18-06-2021 Fri 15:27
  • నీలకంఠాపురంలో పురాతన ఆలయం
  • 1,200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం
  • రఘువీరా, గ్రామస్థుల కృషితో పునర్ నిర్మాణం
  • ఈ నెల 19 నుంచి నాలుగు రోజులు పవిత్ర కార్యక్రమాలు
TDP Chief Chandrababu Naidu appreciates former minister Raghuveera Reddy

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ప్రాచీన ఆలయాన్ని పునర్ నిర్మించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. నీలకంఠాపురంలో ఈ ఆలయాన్ని రేపు శాస్త్రోక్తంగా పునః ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వీడియో సందేశం అందించారు.

మహోన్నతమైన ఆలోచనలతో ఆలయాల పునర్ నిర్మాణం బాధ్యతలు స్వీకరించిన రఘువీరాకు, నీలకంఠాపురం గ్రామస్థులకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 1,200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పురాతన పుణ్యక్షేత్రం ఏపీ, కర్ణాటక ప్రజలకు నెలవుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద పవిత్రమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఇది ఎంతో మంచి సంకల్పం అని చంద్రబాబు అభివర్ణించారు.