భారత్, న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు వర్షం అడ్డంకి

18-06-2021 Fri 14:37
  • నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • భారత్ వర్సెస్ కివీస్
  • సౌతాంప్టన్ లో భారీ వర్షం
  • తడిసి ముద్దయిన రోజ్ బౌల్ స్టేడియం
  • ఆలస్యం కానున్న టాస్ 
WTC Final between Team India and New Zeland delayed due to rain in Southampton

భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే సౌతాంప్టన్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. అది కూడా వరుణుడు శాంతిస్తేనే! ప్రస్తుతం ఇంగ్లండ్ లో వానలు కురుస్తున్న తీరు చూస్తే తొలిరోజు వర్షార్పణం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ చారిత్రక టెస్టు మ్యాచ్ కు సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ మైదానం చిత్తడిగా మారిన తీరు చూస్తే, లంచ్ లోపల మ్యాచ్ ఆరంభమ్యే అవకాశం కనిపించడంలేదు. ఇంకా జల్లు కురుస్తుండడంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తొలి సెషన్ ను రద్దు చేశారు.