New Delhi: వారి బెయిల్​ రద్దు చేయలేం: ఢిల్లీ అల్లర్ల కేసులో కార్యకర్తల బెయిలుపై సుప్రీంకోర్టు

  • బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ పోలీసుల పిటిషన్
  • న్యాయపర అంశాల పరిశీలనకు సుప్రీం ఓకే
  • వచ్చేనెలలో విచారణ చేస్తామని వెల్లడి
Activists granted bail in Delhi riots case to stay out of jail says Supreme Court

బెయిల్ పై విడుదలైన విద్యార్థి నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తల బెయిల్ ను రద్దు చేయలేమని, వారు జైలు అవతలే ఉంటారని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు, ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి నటాషా నర్వాల్, దేవాంగన కలీతా, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తీర్పును ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ‘దేశమంతటా ఈ కేసు ప్రభావం ఉంటుంది’ అన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటూ కేసును విచారణకు స్వీకరిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. అందులోని న్యాయపర అంశాలను పరిశీలించేందుకు అంగీకరిస్తున్నామని, వచ్చే నెలలో కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే, భవిష్యత్ కేసులకు సంబంధించి యూఏపీఏని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని ఢిల్లీ పోలీసులకు సూచించింది.

చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) నిబంధనలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై తాము సంతృప్తిగా లేమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన కేసులో వారికి బెయిల్ ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమని, అందుకే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని చెప్పారు.

More Telugu News