సోనియా, రాహుల్​ తో తమిళనాడు సీఎం సమావేశం

18-06-2021 Fri 12:57
  • ఆమె నివాసానికి వెళ్లి కలిసిన స్టాలిన్
  • అధికారంలోకి వచ్చాక తొలిసారి భేటీ
  • తమిళనాడు బాగు కోసం డీఎంకేతో కలిసి పనిచేస్తామన్న రాహుల్
Tamilnadu CM Stalin Meets Sonia and Rahul

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఇవ్వాళ ఆయన తన భార్యతో కలిసి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చాక సోనియాతో స్టాలిన్ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. సమావేశం సందర్భంగా రాష్ట్ర రాజకీయ, అధికార పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

స్టాలిన్, ఆయన భార్య దుర్గావతి స్టాలిన్ తో సమావేశమవడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసం మెరుగైన పాలన అందించేందుకు, తమిళనాడు అభివృద్ధికి డీఎంకేతో కలిసి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో భాగంగా సీఏఏ, సాగు చట్టాలు, నీట్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాకుండా టీకాల సరఫరా, జీఎస్టీ పరిహారం చెల్లింపు, శ్రీలంక తమిళులకు హక్కులు వంటి విషయాలపైనా చర్చించారు.